నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వింత పోకడలు

సమస్యాత్మక రిజిస్ట్రేషన్లు బయటకు మళ్లింపు ఆరోపణలు – భారీ ఆమ్యామ్యాల గుసగుసలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 20 :

జిల్లా ప్రధాన కేంద్రం అయిన నంద్యాలలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై మరోసారి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..స్థానికంగా పరిష్కారం కావాల్సిన సమస్యాత్మక రిజిస్ట్రేషన్లను ఇక్కడే నమోదు చేయకుండా,గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాల కార్యాలయాలకు మళ్లిస్తున్నారనే సమాచారం బయటకు వస్తోంది..నంద్యాల పరిధిలో ఉన్న స్థలాల రిజిస్ట్రేషన్లను పాణ్యం,ఓర్వకల్లు,కర్నూలు ప్రాంతాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపించి అక్కడ నమోదు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి..!! ఈ వ్యవహారంలో నంద్యాల సబ్ రిజిస్ట్రార్ స్వయంగా ఓకే చెబుతున్నారనే ఆరోపణలు రిజిస్ట్రేషన్ దారుల మధ్య చర్చనీయాంశంగా మారాయి..!! స్థానికంగా పరిష్కరించలేని లేదా వివాదాస్పదమైన భూముల రిజిస్ట్రేషన్లకు ‘ఇక్కడ కుదరదు’ అని చెప్పి,వేరే కార్యాలయాలకు మళ్లించడం వెనుక భారీ స్థాయిలో ఆమ్యామ్యాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..!!  “పైసలు ఇస్తే ఏ సమస్యాత్మక రిజిస్ట్రేషన్ అయినా జరుగుతుందన్న భావన కలుగుతోంది” అంటూ కార్యాలయానికి వచ్చిన కొందరు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..!!  జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఉన్న కీలక కార్యాలయం నుంచే ఇతర ప్రాంతాలకు ఫైళ్లు మళ్లించడం చట్టపరంగా సమంజసమేనా..?? సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి ఉందా..?? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..!!  ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు వాస్తవాలు వెలుగులోకి రావాలంటే విజిలెన్స్ లేదా ఉన్నత స్థాయి విచారణ అవసరమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..!!  ఇప్పటికే సమయపాలన లోపం, పనితీరుపై విమర్శలు ఎదుర్కొంటున్న నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది..!! ప్రభుత్వం స్పందించి నిజానిజాలు బయటపెట్టి,పారదర్శకతకు హామీ ఇస్తుందా..?? లేక గుసగుసలుగానే మిగిలిపోతాయా..??

Scroll to Top