పాత్రికేయుడు మాదాల శ్రీనివాసులు అకాల మరణం జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటు – జర్నలిస్ట్ నాగేంద్ర

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 19 :

నంద్యాల జిల్లా,ప్రజాశక్తి సంస్థలో సుధీర్ఘ కాలంగా పాత్రికేయుడుగా విధులు నిర్వ హిస్తున్న మాదాల శ్రీనివాసులు అకాల మరణం జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటు అని జర్నలిస్ట్ నాగేంద్ర ఆవేదన చెందారు. గురువారం నంద్యాల పట్టణంలో  నిశాంత్ భవనంలో జర్నలిస్ట్ ఆధ్వర్యంలో మాదాల శ్రీ నివాసులుకు సంతాప కార్యక్రమంఏర్పాటుచేశారు.కార్యక్రమానికి ముందుగా మాదాల శ్రీనివాసులు చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  జర్నలిస్ట్ నాగేంద్ర మాట్లాడుతూ మాదాల శ్రీనివాసులు ప్ర జాశక్తి సంస్థలో 1992 నుండి పాత్రికే యుడు విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. తోటి జర్నలిస్ట్ లతో కలిసిమెలిసి జీవించేవారని అన్నారు. అలాంటి వ్యక్తి గత నెల 29వ తేదీన గుండెపోటుకు గురికావడంతో కొంతకాలంగా నంద్యాల, హైదరాబాద్ ఆసుపత్రులలో చికిత్స తీసుకున్న కూడా కోలుకోలేక ఫిబ్రవరి 15వ తేదీన కలం కార్మికుడుగా అమరుడు అయ్యాడని పేర్కొన్నారు. ఆయన మరణవార్త స మాచారం తెలుసుకున్న కర్నూలు, నంద్యాల జర్నలిస్ట్ సమాజం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనట్లు తమ సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తె లియచేశారు. అదేవిదంగా 60ఏళ్ళు పూర్తి చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక పింఛన్ పథకం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంతాప కార్యక్రమంలో రఫీ, హనుమంతరావు, వీవిడి శివరాం, నరసింహమూర్తి, మోహన్, దస్తగిరి, కటారి నాయక్, జి.పెద్దన్న తదితర విలేఖరులు పాల్గొని తమ సంతాపాన్ని తెలియజేశారు.

Scroll to Top