నల్లగట్ల వద్ద కారు బోల్తా – వీఆర్వోకు గాయాలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 17 :

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓబులంపల్లె గ్రామ వీఆర్వో పరమేశ్వర్ రెడ్డి గాయపడ్డారు. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, పరమేశ్వర్ రెడ్డి నంద్యాలలోని శ్రీ ఫకీరప్ప తాతయ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి జాతీయ రహదారి నుంచి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆయనను బయటకు తీసి చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.

Scroll to Top