నంద్యాలలో ఘనంగా మునియార్ ఖలీల్ అహ్మద్ పుట్టినరోజు వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 17 :

నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు నంద్యాల టౌన్ ప్రెసిడెంట్ మునియార్ ఖలీల్ అహ్మద్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఖలీల్ అహ్మద్ కేక్ కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఖలీల్ అహ్మద్‌ కు శాలువాతో  సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మనందరి ఆత్మీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు నంద్యాల టౌన్ ప్రెసిడెంట్ మునియార్ ఖలీల్ అహ్మద్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని. నంద్యాల పట్టణంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో ఖలీల్ అహ్మద్ అలుపెరగని కృషి చేస్తున్నారని అన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో ఉన్నత పదవులు అధిష్టించాలని, నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.

ఈ సందర్భంగా మునియార్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన మా ప్రియతమ యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ నాయకత్వంలో నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నేను ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. నాపై నమ్మకం ఉంచి నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా మరియు నంద్యాల టౌన్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, యువనేత నారా లోకేష్ కి, మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి మరియు మా నియోజకవర్గ పెద్దలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. నా పుట్టినరోజును ఒక పండుగలా నిర్వహిస్తున్న పార్టీ కౌన్సిలర్లకు, వార్డు ఇంచార్జిలకు, నా శ్రేయోభిలాషులకు మరియు నా ప్రాణసమానమైన కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని. మీరందరూ చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలే నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని . ప్రజల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా మైనార్టీల సంక్షేమానికి నా వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగార్జున, ఉప్పర కార్పోరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్, దీపక్ రెడ్డి, గోవిందు నాయుడు, బుగ్గ రాముడు, శేఖర్ రెడ్డి, జైలాన్, అజ్మీర్, మారుతి కుమార్, మా భాష, ఎబినేజర్, మజీద్, అక్బర్, షబ్బీర్, అలీ, జాకీర్ , రామ్ మద్దయ్య ,  బెండకాయల ఇస్మాయిల్, సుబ్బయ్య, హుస్సేన్, గుల్లి, కరిముల్లా, నాగరత్నమ్మ , పద్మ, జోష్ణ, నాగరాజు, సంపంగి జయకృష్ణ మరియు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు మరియు ఖలీల్ అహ్మద్ అనుచరులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top