



భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగం
శివరాత్రి పర్వదినాన సుమారు 1,30,000 పైగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్న భక్తులు….
గత సంవత్సరంతో పోలిస్తే 30% అధికంగా క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు
వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిరంతరణకు బ్లూ కోర్ట్స్ వాహనాల వినియోగం
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో దేవాదాయ, పోలీస్ ,రెవిన్యూ అటవీ శాఖ,మరియు మీడియా చేసిన కృషి అభినందనీయం….
- జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఐపిఎస్
సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 16 :
నంద్యాల జిల్లాలోని మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రశాంతంగా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం శ్రీశైల క్షేత్రానికి సుమారు 30% అధికంగా భక్తులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. ఇందుకు అనుగుణంగా దేవాదాయ ,పోలీస్ ,రెవెన్యూ శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది.
బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి అనగా 08/2/2026 నుండి 16/2/2026 మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారు 6,28,472 మంది భక్తులు శ్రీశైల క్షేత్రంను సందర్శించి స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. ఇందులో శివ స్వాములు అధికంగా ఉన్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్సులు కార్లుకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు ఒక క్రమపద్ధతిలో నిలుపుకునేలా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సులువుగా ముందుకు వెళ్లేలా బ్లూకోర్ట్ మోటార్ సైకిల్ లను 24/7 క్షేత్ర పరిసర ప్రాంతాల్లో తిరిగేలా చర్యలు తీసుకోవడం జరిగింది.
శ్రీశైల క్షేత్రంనకు వచ్చే వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా భారీ వాహనాలను ఆత్మకూరు ఆత్మకూరు నుండి నంద్యాల , గిద్దలూరు మీదుగా విజయవాడకు వెళ్ళుటకు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది.
క్షేత్రం నందు శాంతిభద్రతల పరిరక్షణ, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతిష్ట భద్రతా చర్యలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షణ చేయడం జరిగింది.
బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన లింగోద్భవ సమయంలో నిర్వహించే పాగా అలంకరణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి సుమారు 8,000 మంది భక్తులు గుడి లోపలి పరిసరాల్లో కూర్చునే విధంగా ఏర్పాటు చేయడంతో పాటు అంతే కట్టుదిట్టమైన భద్రతతో పాగాలంకరణ అనంతరం వారిని సురక్షితంగా గుడి నిష్క్రమణ మార్గాల ద్వారా బయటకు పంపడం జరిగింది.
క్షేత్రానికి వచ్చిన భక్తులు రథోత్సవంలో పాల్గొననున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాల ద్వారా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో తోడ్పాటును అందించిన పోలీస్, రెవెన్యూ,దేవాదాయ, అటవీ మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు వారి సిబ్బందినీ మరివిశేషంగా ప్రచారం చేసేందుకు కృషిచేసిన మీడియా వారిని నంద్యాల జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది.
