రంజాన్ ఏర్పాట్లపై మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ కు ఇమాముల సంఘం వినతి

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 16 :

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, నంద్యాల జిల్లాలోని ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని జిల్లా ఇమాముల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ భాషా సిద్ధికి మాట్లాడుతూ ప్రార్థనల సమయంలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని. వేసవి తీవ్రత దృష్ట్యా మసీదుల వద్ద త్రాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలని మున్సిపల్ అధికారుల సమన్వయంతో మసీదుల పరిసరాల్లో పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణ మరియు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. అలాగే అర్హులైన ఇమాములకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి ఫరూక్ దృష్టికి వినతి పత్రంలో కోరారు

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో రంజాన్ ఏర్పాట్లపై తక్షణమే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని, విద్యుత్, నీరు, పారిశుధ్యం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ భాష సిద్ధికి, ఉపాధ్యక్షులు మౌలానా మహబూబ్ బాషా, మౌలానా ముర్తుజ, మౌల్వి రఫిక్, మౌల్వి అబ్దుల్లా, హాఫిజ్ అబ్దుల్ రెహమాన్, హాఫిజ్ రజాక్, హాఫిజ్ అబ్దుల్ మజీద్, మౌలానా జుబేర్, హాఫిజ్ మన్సూర్, హాఫిజ్ హిదయాత్, హాఫిజ్ అమీర్ తదితర ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Scroll to Top