

డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తున్న కూటమి ప్రభుత్వం
నంద్యాలలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి మెడికల్ షాపులను సీజ్ చేయాలి
నంద్యాల పట్టణంలోని డిఎం & హెచ్ఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో జిల్లా వైద్య శాఖ అధికారులను డిమాండ్ చేసిన
సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు
విచ్చలవిడిగా డ్రగ్స్ పేరుతో పేద ప్రజలను దోచుకుంటున్న ఫార్మ కంపెనీలను సీజ్ చేయాలి
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్
అనుమతులు ఒకరివి-డ్రగ్స్ అమ్మేది ఒకరు-చర్యలు శున్యం
అధిక ధరలకు డ్రగ్స్ ను అమ్ముతు పేద ప్రజలను మోసం చేస్తున్న ఫార్మ కంపెనీలను రద్దు చేసి ప్రభుత్వమే డ్రగ్స్ ను సప్లై చేయాలి
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాముడు, భార్గవ్
నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పటల్స్ దోపిడీపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం
రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 14 :
రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని,డ్రగ్స్ మాఫియా పేరుతో పేద ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి ఫార్మా కంపెనీలను సీజ్ చేసి ప్రభుత్వమే డ్రగ్స్ సప్లై చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని, నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పటల్స్ యాజమాన్యాలు సమూహంగా ఏర్పడి పేద ప్రజలను దోచుకుంటున్నటువంటి హాస్పటలపై జిల్లా స్థాయి వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సిపిఐ కార్యాలయం నుండి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి డిఎం & హెచ్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగిందని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు సిపిఐ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా సమితి సభ్యులు మురళీధర్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హరినాథ్,మరియు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి, ఉదయ్, ఎఐవైఎఫ్ నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
