



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 14 :
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామం నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దట్టమైన పులుల అభయారణ్యంలో గుండా శ్రీశైల క్షేత్రమునకు పాదయాత్రగా వెళ్తున్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికీ శనివారం బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపి ఆమె వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. నల్లమల అరణ్యం మధ్యలో ఉన్న చెంచుల రాజధాని పెచ్చేరువు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మధ్యాహ్నం విరామం సందర్బంగా దాతలు కాలినడకన శ్రీశైలం వెళ్లే శివ భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో భోజనం చేశారు. ధట్టమైన అడవి మధ్యలో ఉన్న పెచ్చేరువులో చెంచులు పూజల కోసం నిర్మాణంలో ఉన్న శివాలయాన్ని సందర్శించి, అక్కడ అన్నదాన ప్రదేశంలో, పాఠశాలలకు భోజన వసతులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కల్పించి చెంచులతో కలిసి భోజనం చేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర భారతీయ జనతా పార్టీ జాతీయ సభ్యురాలు ఆత్మకూరు మెహమాన్ షబానా, బనగానపల్లె బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి బి వి సుబ్బారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎంపీ వెంట నడిచారు.
