*ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్*




సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 13:
నంద్యాల పట్టణంలోని వై.ఎస్.ఆర్ నగర్, కరుణామయ స్కూల్ మెయిన్ రోడ్డు వద్ద మూడు రోజుల పాటు నిర్వహించిన మెస్సీయా రాజ్య సువార్త కూడికలు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ సమాజంలో శాంతి, సమానత్వం నెలకొల్పడానికి ఇలాంటి ఆధ్యాత్మిక సభలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కుల, మత, వర్గ విభేదాలకు తావులేకుండా అందరూ సోదరభావంతో మెలగాలని, దైవచింతన వల్ల మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
గత మూడు రోజులుగా జరిగిన ఈ సువార్త కూడికలకు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో నిర్వాహకులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ డ్యాని , పాల్ జోసఫ్, 38వ వార్డు తాటికొండ బుగ్గ రాముడు, శివ నాగిరెడ్డి, మరాఠీ సూరి, జైలాన్, ప్రసాద్ రెడ్డి మరియు ఇతర స్థానిక నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
