వైద్య సంస్థల్లో ఏకరీతి జీవిత భాగస్వామి బదిలీ విధానం అమలు చేయండి  –  పార్లమెంట్ లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 12 :

కేంద్ర ప్రభుత్వం అన్ని స్వయం ప్రతిపత్తి గల వైద్య సంస్థలలో ఏకరీతి జీవిత భాగస్వామి బదిలీ విధానం అమలు చేయాలని, ఈ ధీర్గకాలిక సమస్యను పరిష్కరిండానికి పారదర్శక అంతర్ – సంస్థాగత బదిలీ విధానం ఏర్పాటు చేయాలని గురువారం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్‌సభలో జీరో అవర్‌లో పార్లమెంట్ దృష్టికి తెచ్చారు.

లోక్ సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి వైద్య సంస్థలలో పనిచేస్తున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులకు, ముఖ్యంగా మహిళలకు, ఏకరీతి జీవిత భాగస్వామి బదిలీ విధానం లేకపోవడం బాధేస్తోందని అన్నారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, ఉమ్మడి విధానం లేకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి తమ జీవిత భాగస్వాముల నుండి విడివిడిగా జీవించాల్సి వచ్చిందని, దీనివల్ల రాజీనామాలు, వృత్తిపరమైన అస్థిరత,  పరోక్ష లింగ వివక్షకు దారితీసిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్ సభ దృష్టికి తెచ్చారు.

కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని స్వయంప్రతిపత్తి గల వైద్య సంస్థలలో ఏకరీతి జీవిత భాగస్వామి బదిలీ విధానాన్ని అమలు చేయాలని,  ఈ దీర్ఘకాలిక కష్టాన్ని పరిష్కరించడానికి పారదర్శక అంతర్-సంస్థాగత బదిలీ విధానాన్ని ఏర్పాటు చేయాలని లోక్ సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.

Scroll to Top