


మీకు నియమించిన డ్యూటీ ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి
సాయుధ బలగాల సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్
సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / ఫిబ్రవరి 11 :
శ్రీశైలం నందు జరుగుచున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు విధులకు స్పెషల్ పార్టీ, ఆర్ముడు రిజర్వు సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు సిబ్బంది కర్నూలు, నంద్యాల అన్నమయ్య మొదలగు జిల్లాల నుండి సుమారు 180 మంది సాయుధ బలగాల సిబ్బందికి జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శ్రీశైలంలో శివదీక్ష ధరించిన భక్తులకు సుధూర ప్రాంతాల నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రయాణించి దైవదర్శనానికి రావడం జరుగుతుందని కావున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా గౌరవప్రధంగా మాట్లాడుతూ వారు వెళ్ళవలసిన మార్గాల వైపు క్రమశిక్షణతో వెళ్లి దర్శనం చేసుకునే విధంగా దిశా నిర్దేశం చేయాలన్నారు. విధులలో ఉన్న సిబ్బంది ఎట్టి పరిస్థితులలోనూ సహనం కోల్పోరాదు. మీకు కేటాయించిన ప్రదేశాలలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలి.
ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి.
బందోబస్తుకు వచ్చిన సిబ్బందిని రెండు సెక్షన్లుగా విభజించి చంద్రావతి కళ్యాణమండపం, ఫ్రీ క్యూ లైన్ ,లడ్డు కౌంటర్, గంగాధర మండపం, నంది సర్కిల్, దాసరి సత్రం ,ఆర్టీసీ బస్టాండ్ ,సిద్ధరామయ్య కాంప్లెక్స్ ,పాతాళగంగ, స్నాన ఘట్టాలు మరియు పార్కింగ్ ప్రదేశాలలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్, శ్రీశైలం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జీవన్ గంగానాథ్ బాబు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్ మరియు బాబు మరికొందరు అధికారులు పాల్గొన్నారు.
