శ్రీశైలంలో ఉన్న 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 11 :

మహాశివరాత్రి సందర్భంగా నడకదారిన శ్రీశైలం చేరుకున్న భక్తులకు అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించిన జిల్లా కలెక్టర్.  పాదయాత్ర ద్వారా వచ్చిన భక్తులు, ముఖ్యంగా చిన్నారులు మరియు వృద్ధుల ఆరోగ్య పరిస్థితులపై  ఆరా తీసిన కలెక్టర్. భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆసుపత్రిలో కల్పించిన వైద్య సదుపాయాలు, తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించిన కలెక్టర్.  అత్యవసర చికిత్సలు, ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్), ఔషధాల లభ్యతపై వైద్య అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్.  వైద్య సిబ్బంది హాజరు, సేవల నాణ్యత, రోగుల నమోదు విధానంపై ప్రత్యేకంగా సూచనలు జారీచేసిన జిల్లా కలెక్టర్.  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమయానుకూలంగా వైద్య సేవలు అందించాలని  ఆదేశించిన కలెక్టర్.

Scroll to Top