



సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 08 :
నంద్యాల నియోజకవర్గంలో మంత్రి ఫరూక్ తనయుడు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ప్రజలు ఆపద సమయాల్లో అందించే మెడికల్ రీయబర్స్మెంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులకు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు 54 మంది లబ్ధిదారులకు 29 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 22 సార్లు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశామన్నారు.దాదాపు 550 మందికి 3 కోట్ల వరకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఇప్పటివరకు లబ్ధిదారులకు పంపిణీచేశామన్నారు.ఈ రోజు నంద్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 29 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని తెలిపారు . కూటమి ప్రభుత్వం అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న లబ్ధిదారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు సహాయ నిధిని అందిస్తున్నట్లు తెలిపారు . నంద్యాల టౌన్ , నంద్యాల మండలం మరియు గోస్పాడు మండల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు . ముఖ్యమంత్రి సహాయ నిధిని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రులు నారా లోకేష్ , ఎన్ఎండి ఫరూక్ లతో పాటు ఫిరోజ్ , ఫయాజ్ లకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ , గోస్పాడు మండల టిడిపి కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి , నంద్యాల మండల కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, కౌన్సిలర్లు కండే శ్యాం సుందర్ లాల్, జైనాభి, షేక్ మున్న మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
