నంద్యాల పట్టణ కేంద్రంలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / ఫిబ్రవరి 08 :

 12 మంది మైనర్లకు కౌన్సిలింగ్ 60,000/- జరిమాన

 రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ప్రజల రక్షణ కోసమని గుర్తించాలి

  • నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ భాష

రహదారి ప్రమాదాలను నివారించడమే లక్ష్యంతో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షొరాణ్ ఐపిఎస్ ఆదేశాలమేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ బాషా ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు పట్టణ కేంద్రంలో మైనర్లు వాహనాలు నడపడం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడింది.

ఈ సందర్భంగా 12 మంది మైనర్లు  చట్టవిరుద్ధంగా రెండు చక్రాల వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి, ఒక్కొక్కరికి 5,000/- రూపాయల చొప్పున 60,000/- జరిమాన విధించడంతో పాటు వారిని తల్లిదండ్రులు, సంరక్షకులను స్టేషన్ వద్దకు పిలిపించి రహదారి భద్రత, మైనర్ల వాహన నడపడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలు మరియు బాధ్యతగల పర్యవేక్షణ అవసరంపై అవగాహన కల్పించారు. మరియు మైనర్లకు ట్రాఫిక్ నియమాలు మరియు సురక్షిత డ్రైవింగ్ పద్ధతులపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.

ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. కావున ప్రజలు తప్పనిసరిగా రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలని కోరుకోవడం తోపాటు ఇవన్నీ ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా రక్షణ కోసమేనని గుర్తించి పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.

Scroll to Top