చిన్న, వీధి వ్యాపారస్తుల సంక్షేమానికి సహకరిస్తాం – ఎన్ఎండి ఫిరోజ్

నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన ఫిరోజ్ ను సత్కరించిన నంద్యాల జిల్లా చిన్న,వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 04 :

నంద్యాల పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడవసారి ఎంపికైన ఎన్ఎండి ఫిరోజ్ ను నంద్యాల జిల్లా చిన్న,వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందించారు.

     ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమం కోసం సహకరిస్తామని, వారి ప్రయోజనాలు కాపాడుతామని అన్నారు.  గుర్తింపు కార్డులు లేనివారికి కొత్త కార్డులు అందజేస్తామన్నారు. మెప్మా ద్వారా వారికోసం కేటాయించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీధి వ్యాపారస్తుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రజలకు,పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటామని,ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని తెలిపారు. డాక్టర్ రవి కృష్ణ చిన్న,వీధి వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం చాలా సంవత్సరాలుగా ముందుండి నడిపించడం అభినందనీయం అన్నారు.

     డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ “కేంద్ర వీధి వ్యాపారస్తుల  జీవనోపాధి రక్షణ చట్టం” ప్రకారం వారి ప్రయోజనాలను కాపాడడం అవసరమన్నారు. టౌన్ వెండింగ్ కమిటీ మున్సిపాలిటీ తరపున ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.మంత్రి ఫరూక్, తెలుగుదేశం పార్టీ యువ నేతలు ఫయాజ్,ఫిరోజ్  వీధి వ్యాపారస్తులకు నిరంతరం అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

     ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చిన్న,వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా,ప్రధాన కార్యదర్శి చిన్న మాతంగి ఉమా మహేష్, ఉపాధ్యక్షులు అజీజ్ ఖాన్,మద్దినేని వెంకటరమణ,సంయుక్త కార్యదర్శులు షేక్ ఖాజా హుస్సేన్ బాణాల వెంకటేశ్వర్లు ఆచారి,కార్యవర్గ సభ్యులు శివ ఆచారి, షేక్ పాంశావళి, గంగిశెట్టి, షేక్ అన్వర్ భాష,షేక్ నాజర్ భాష,  ఆకుమల్ల శ్రీనివాసులు, ఆకుమల్ల వెంకటరమణ, పెద్ద సంఖ్యలో చిన్న, వీధి వ్యాపారస్తులు పాల్గొన్నారు.

Scroll to Top