గిరిజనుల గోడు అధికారులకు పట్టాదా – ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్

• చెంచు గిరిజనుల పట్ల హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యం

• ఇళ్ల నిర్మాణ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని నంద్యాల హౌసింగ్ కార్యాలయం వద్ద పాణ్యం చెంచు మహిళలు ఆందోళన

• పట్టించుకోని ఐటిడిఏ అధికారులు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 04 :

బిల్లులు మంజూరయ్యే వరకు కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు సిద్ధమవుతాం… జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు నారాయణమ్మ, నాగశేషులు అధికారులకు హెచ్చరిక.

అట్టడుగున నివసిస్తున్న పాణ్యం చెంచు ప్రజల గోడు హౌసింగ్ అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తూ వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు నారాయణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కట్టుకున్న ఇళ్ల నిర్మాణ హౌసింగ్ బిల్లులు మంజూరు కాకపోవడంతో బుధవారం నంద్యాల హౌసింగ్ కార్యాలయం వద్ద పాణ్యం చెంచు మహిళలు బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్ వారికి మద్దతుగా నిలిచారు. సందర్భంగా రాజు నాయక్, నారాయణమ్మ మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాణ్యం చెంచు కాలనీలో ప్రభుత్వం 175 మందికి ఇల్లు మంజూరు చేసింది. వీరిలో కొందరు ఇల్లు దాదాపు పూర్తి చేసుకున్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కొక్క ఇంటికి నాలుగు దఫాలుగా హౌసింగ్ అధికారులు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే 45 మంది లబ్ధిదారులకు మాత్రమే కొంత బిల్లులు మంజూరయ్యాయి. మిగతా వారికి బిల్లులు చెల్లించకపోవడంతో గిరిజనులు చాలా అవస్థలు పడుతున్నారన్నారు. అన్ని ప్రాంతాల్లో పునాదులు అయిపోయిన తర్వాత నుంచి వరుస బిల్లులు చెల్లిస్తున్నారని నంద్యాల జిల్లాలో హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని మహిళలు ధ్వజమెత్తారు. పూట గడవక అవస్థలు పడుతున్న గిరిజనుల పైన అధికారులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు.

అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న వారికి నేటికి ఒక పైసా డబ్బులు పడకపోవడంతో అయోమయంలో ఉన్నారన్నారు. ఇల్లులు పూర్తికాక ఒకవైపు అప్పులు మరోవైపు బిల్లులు రాక ..మరోవైపు రాత్రి వేళలో పాములు, తేళ్ల, మధ్యన నిద్రిస్తున్నారని అన్నారు. ఐ టి డి ఏ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కనీసం ఒక్కసారైనా చెంచు కాలనీకి వచ్చి పర్యవేక్షణ చేకపోవడం దారుణం అన్నారు. ఉన్న గుడిసెలు తీసేసి ఇల్లు నిర్మాణం చేస్తున్న చోటే తలదాచుకోవాల్సిన పరిస్థితి పాణ్యం చెంచు ప్రజల దుస్థితి ఉందన్నారు. బిల్లులు మంజూరు చేయకపోతే హౌసింగ్ కార్యాలయం వద్దనే వంట వార్పు ఏర్పాటు చేసి ఉండాల్సి వస్తుందన్నారు.

Scroll to Top