

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 04 :
నంద్యాల జిల్లా ప్రజలకు అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన మందులను అందించాలనే లక్ష్యంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి జన ఔషది మెడికల్ షాప్ రూమును బుధవారం జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ జి. రాజకుమారి పరిశీలించారు. త్వరలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రారంభించబోయే మెడికల్ షాపుకు సంబంధించి కావలసిన సామాగ్రి ను, పనులను సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన మందులను తక్కువ ధరకే ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి జన ఔషధీ మెడికల్ షాపులను ప్రారంభిస్తున్నారని అందులో భాగంగా నంద్యాల ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవడం జరుగుతుందన్నారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, జిల్లా సెక్రెటరీ మరియు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ జిలాని భాష, రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ భాష, రెడ్ క్రాస్ డీఎఫ్ఓ సమీ, ఫార్మసిస్టు ఇంద్రజ, మున్సిపల్ ఇంజనీర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
