
సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 04 :
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ ఆదేశాలమేరకు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పోలీసు అధికారి కె.ప్రమోద్ పర్యవేక్షణలో కోవెలకుంట్ల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. హనుమంత్ నాయక్ కోయిలకుంట్ల పోలీసు స్టేషన్ సైబర్ క్రైమ్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేయడం జరిగింది.
నిందితులు :
1. A. చంద్రశేఖర్ @ అక్కపల్లి చంద్రశేఖర్, వయస్సు : 32 సంవత్సరాలు, తండ్రి: చెన్నయ్య, కులం- మున్నూరు కాపు, ఇంటి నెంబర్ 3-111, హన్వాడ గ్రామం మరియు మండలం, మహబూబ్ నగర్ జిల్లా. ప్రస్తుతము పాత బస్టాండు వెనక, జవహర్ నగర్ కాలనీ, జడ్చర్ల, తెలంగాణ రాష్ట్రం.
2. దాసరి సందీప్ కుమార్, వయస్సు 27 సం,,లు, తండ్రి: దాసరి బాలరాజు, కులం: మున్నూరు కాపు, డోర్ నెంబర్ 5-110/2, స్టేట్ బ్యాంకు వెనకాల, హన్వాడ, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
కేసు వివరాలు :-
28.01.2026 న నిందితుడు అక్కపల్లి చంద్రశేఖర్ తాను తెలంగాణా రాష్ట్రం గద్వాల్ ఎస్ఐ అని ఫిర్యాది కోవెలకుంట్ల కి చెందిన కర్నాటి ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసి మీరు గద్వాల్ లో కండక్టర్ భార్యకు మెసేజ్ చేయడం వలన అది చూసిన కండక్టర్ ఆమెను కొట్టడంతో గడ్డిమందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది రోజుకు రెండు లక్షలు చొప్పున రెండు రోజులకు కట్టాలి. మీరు కడితే సరే లేదంటే పోలీసు కేసు అవుతుందని బెదిరించినారు. కాబట్టి కండక్టర్ తో మాట్లాడుకోమని చెప్పగా రెండవ నిందితుడు దాసరి సందీప్ కుమార్ కండక్టర్ లాగా మాట్లాడి 4 లక్షలు రూపాయలకు గానూ ఫోనేపే లో 30,000/- రూపాయలు డబ్బులు వేయించుకున్నాడు. అందుకు కోవెలకుంట్ల పోలీసు స్టేషన్ లో సైబర్ క్రైమ్ కేసు నమోదు అయినది.
ఇప్పటిదాకా విచారణలో సుమారు 15 లక్షల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో మరియు తెలంగాణాలో ఒక్కొక్కరి నుండి 50,000/- లు, లక్ష, 2 లక్షలు, 3 లక్షలు బెదిరించి వీరి ఫోన్ పే మరియు బ్యాంకు అకౌంట్లలో వేయించుకున్నట్లు తెలిసింది.
బాధితులు థ్రెడ్స్ యాప్ లో మహిళల ఫోటోలలో కామెంట్ ల యందు చాటింగ్ చేయడం , వీరి ఫోన్ నెంబర్లు పెట్టడంతో ఈ ఇద్దరు నిందితులు వాటిని గమనించి బాధితులకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఎస్ఐ కాకపోయినా ఎస్ఐ అని బెదిరించి డబ్బులు వీరి అకౌంట్లో వేయించుకొని మోసం చేసినారు. ఇప్పటివరకు సుమారు 2 నెలల కాలంలో 15 లక్షల రూపాయలు వీరు అకౌంట్లలో వేయించుకున్నారు. ఇంకా కొంత మంది పేర్లు తెలియవు అని అంటున్నారు. ఎవరైనా వీరి వలన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, పక్క రాష్ట్రాలలో మోసపోయి ఉంటే ఇప్పటికైనా సంబంధిత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయమని తెలియజేస్తున్నాము.
ఏదైనా సైబర్ నేరం లేదా ఆన్‌లైన్ ఆర్థిక మోసం జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలి. అలా చేస్తే తక్షణం సంబందిత పోలీస్ లు మీకు అందుబాటులో వస్తారు
1930 కు తక్షణమే ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును వెంటనే నేరస్థుల బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది మరియు సంబంధిత క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేయడం సాధ్యమవుతుంది.
