ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన 38 వార్డు ఇంచార్జ్ తాటికొండ బుగ్గ రాముడు

అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తున్న కూటమి ప్రభుత్వం

మంత్రివర్యులు నంద్యాల ఎమ్మెల్యే ఎన్.ఎం.డి. ఫరూక్, ఎన్.ఎం.డి  ఫిరోజ్, ఎన్.ఎం.డి ఫయాజ్ ఆదేశాలతో 38వ వార్డు లో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 31 :

నంద్యాల నియోజకవర్గంలో శనివారం అనగా ఈరోజు ఉదయం మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్,   ఎన్.ఎం.డి. ఫిరోజ్, ఎన్.ఎం.డి ఫయాజ్ ఆదేశాల ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 38 వార్డు వై.యస్.ఆర్ నగర్ నందు ఇంచార్జ్ టిడిపి సీనియర్ నాయకులు తాటికొండ బుగ్గ రాముడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో  38వ వార్డు వై.యస్.ఆర్ నగర్  సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది 30 సంవత్సరాల లో మొట్టమొదటిసారిగా ఒక్కరోజులో నే రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి 2730 కోట్ల పింఛన్ల మొత్తాన్ని అవ్వ తాతలకు పంపిణీ చేసి, వారిచేత శభాష్ అనిపించుకున్న ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు కే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు వై.యస్.ఆర్  నగర్ లో భర్త చనిపోతే ఒక్క నెలలోనే భార్య బలగొల్ల ఎల్లమ్మ కు కొత్త పెన్షన్ మంజూరు చేయడం జరిగింది అని ఆయన అన్నారు. 1వ తేదీన ఆదివారం కావడం వలన 31వ తేదీన అనగా ఒకరోజు ముందుగా పెన్షన్ పంపిణీ చేయడం ఈ ఘనత కేవలం ఒక చంద్రబాబు నాయుడు కే సాధ్యమని చంద్రబాబు నాయుడు కి  మరియు టిడిపి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 200 పెన్షన్ నుండి 2000లకు 2000 నుంచి 4 వేలకు పెన్షన్లు మంజూరు చేసి అవ్వ తాతలకు,వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి అందరితో శభాష్ అనిపించుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కె దక్కుతుంది అని తెలియజేశారు, అనంత ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ సౌభాగ్యవతి, హిమామ్ హుస్సేన్, తదితర 38 వార్డు టిడిపి నాయకులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top