





మూడో విడత దీర్ఘకాలిక మందుల కొనుగోలుకై 100 మందికి ఒక్కొక్కరికి 2000 చొప్పున రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన వ్యాపార వేత్త గోళ్ళ రాజేష్
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 30 :
నంద్యాల పట్టణంలోపి స్థానిక శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో శుక్రవారం కార్యక్రమ నిర్వాహకులు, సీనియర్ రిపోర్టర్ నూర్ బాషా ఆధ్యక్షతన నంద్యాల వాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త గొళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో పేద, మథ్య తరగతి ప్రజలకు దీర్ఘకాలిక మందుల కొనుగోలుకై మూడవ విడత లో భాగంగా దాదాపు 100 మందికి 2 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. గొళ్ళ రాజేష్ వ్యాపార రీత్యా అందుబాటులో లేనప్పటికీ తాను నమ్మే సిద్ధాంతం ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న ఉద్దేశంతో, భారతరత్న నోబుల్ శాంతి గ్రహీత మదర్ థెరీసా స్ఫూర్తితో నంద్యాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ నేడు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ప్రతి నెల మందులు కొనుగోలుకు ఆర్థిక సహాయంగా ప్రతి ఒక్కరికి 2,000 రూపాయల ఆర్థిక సాయం చేసి దాదాపు 2 లక్షల రూపాయలు అందించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు, ఏపీయుడబ్లుజె జిల్లా కార్యదర్శి ఉస్మాన్ భాష, కార్యక్రమ సమన్వయకర్త, సీనియర్ జర్నలిస్ట్ నూర్ భాషా తదితరులు పాల్గొని మాట్లాడుతూ సమాజంలో ఆదరణ కోల్పోయి, సంపాదించేందుకు వీలులేని పేదల ప్రజలకు ఇటువంటి తోడ్పాటు ఎంతో చేయూతనిస్తుందని, ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న గోళ్ళ రాజేష్ అభినందనీయుడని, అలాగే ఈ కార్యక్రమాన్ని నంద్యాలలో ఇంత పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వంతో పాటు ఇటువంటి దాతల చేయూత ఎంతో ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు. సంపాదించిన దాంట్లో కొంతమేర ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయమని, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న గోళ్ళ రాజేష్ పలువురికి ఆదర్శప్రాయుడని కొనియాడారు.
