

పట్టణంలో అన్ని వార్డుల్లో నిరంతరాయంగా ఆక్రమణలు తొలగించండి
రోడ్లు,కాల్వలు,ఆవులు,కుక్కల సమస్య పరిష్కరించండి
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 27 :
నంద్యాల పట్టణంలో మూన్నాళ్ళ ముచ్చటగా ఆక్రమణలు ఎందుకు తొలగిస్తున్నారు.పట్టణంలో అన్ని వార్డుల్లో ఆక్రమణలు నిరంతరాయంగా తొలగించాలని కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ కౌన్సిల్ లో పేర్కొన్నారు.నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మెన్ అధ్యక్షతన సాదారణ కౌన్సిల్ సమావేశం జరిగింది.కౌన్సిల్ అజెండాలో పొందుపరిచిన 13 అంశాలను ఒకే చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్స్ పలువురు మాట్లాడుతూ కౌన్సిల్ దృష్టికి తీసుకొని రాకుండా అధికారులు గాంధీ చౌక్ సమీపంలో ఫుట్ పాత్ పై వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆక్రమణలు తొలగించారు.ఆక్రమణలు తొలగించడానికి వ్యతిరేకం కాదని అన్నారు.ఆక్రమణలు మూన్నాళ్ళ ముచ్చటగా చేసి వదిలి పెట్టడంతో వ్యాపారులకు భారీగా నష్టం వస్తుందన్నారు. తూ , తూ మంత్రంగా ఒకటి,రెండు రోజులు ఆక్రమణలు తొలగించడం,చెప్ప పెట్టకుండా నిలిపివేయడం లో అంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి అన్నారు.12 వార్డ్ కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ మాట్లాడుతూ నా వార్డులో వివిధ పనులకు 80 లక్షలు కౌన్సిల్ లో తీర్మానం అయినా దాదాపు 15 నెలల గడుస్తున్న ఒక్క పని ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. అన్ని వార్డుల్లో రోడ్లు,కాల్వలు వేస్తున్నారు,అవే రోడ్లు,కాల్వలు నా వార్డులో ఎందుకువేయడం లేదని అన్నారు.ఆక్రమణలు తొలగించడం స్వాగతిస్తున్నామని కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా అన్ని వార్డుల్లో ఆక్రమణలు తొలగించాలని కోరారు.వైస్ చైర్మెన్ గంగిశెట్టి నాగ శ్రీధర్ మాట్లాడుతూ బైర్మల్ వీధి లో సైతం ఆక్రమణలు తొలగించాలని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు.కౌన్సిలర్ తబ్రేజ్ మాట్లాడుతూ మా వార్డులో శానిటేషన్ సరిగా లేదని,మసీదులు,పాఠశాలల వద్ద చెత్తా,చెదారం తొలగించాలని కోరారు.కౌన్సిలర్ తమీమ్ మాట్లాడుతూ సిబ్బంది కొరత ఉందని,చెత్త తీసుకుపోవడానికి ట్రాక్టర్ లేదని ట్రాక్టర్ సౌకర్యం కల్పించాలని కోరారు.అలాగే పట్టణంలో దోమలు విపరీతంగా ఉన్నాయని ఫ్యాగింగ్,స్ప్రే చేయాలని కోరారు.పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ గోవులు అడ్డగా ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గో శాలకు తరలించాలని కోరారు.ప్రదంగా అన్ని వార్డుల్లో కుక్కల సమస్య అధికంగా ఉన్నాయని వాటికి ఆపరేషన్లు చేసినా పిల్లలు పడుతున్నాయని కౌన్సిలర్ కృష్ణా కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి నవ్వులు కురిపించారు.పట్టణంలో విధి లైట్స్,మంచినీటి సమస్యలు అధికంగా ఉన్నాయని,పైపు లైన్ పనులు త్వరితగతిగా పూర్తిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్స్ వారి సమస్యలు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు.
