నంద్యాల లో కౌలు రైతులకు గొప్ప శుభవార్త

కౌలు రైతుల పంటలకు కావలసిన యూరియాలను ఉచితంగా అందించనున్నారు గోళ్ళ రాజేష్

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 27 :
రబి సీజన్ లో వేసుకునే పంటలలో భాగంగా కౌలు రైతుల కొరకు ఒక బస్తా యూరియా, ఒక బస్తా డి.ఏ.పి,ఒక బస్తా అమోనియా ను రైతుల అందించి వారిని ఆదుకునేందుకు బాధ్యతతో ముందుకు వచ్చారు మన నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త,సామాజికవేత్త గోళ్ళ రాజేష్.
ఎద్దు ఏడ్చిన పొలము.. రైతు ఏడ్చిన రాజ్యము బాగుపడదు అనేది పెద్దల సూక్తి.
మనకు ఆహారం అందిస్తూనే రైతులు అనేక ఎన్నో రకాలుగా సవాళ్లను ఎదుర్కొంటున్నందున వారు నిజమైన యోధులు..మానవ నాగరికత ఉనికికి రైతులు కీలకం. దేశ ఆర్థిక పురోగతికి రైతులు గణనీయమైన కృషి చేస్తారు.
ఇప్పటికే నంద్యాల నియోజకవర్గంలోని పేద,మధ్య తరగతి ప్రజలకు,రైతులకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా ఆత్మస్థైర్యాన్నిస్తున్నారు.మరోవైపు నిరుద్యోగ విద్యార్థులకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆర్థిక సాయం అందిస్తూ పేదల పెద్దన్నగా ముందుకు వెళ్తున్నారు మన నంద్యాల వాసి ప్రముఖు వ్యాపారవేత్త సామాజికవేత్త గోళ్ళ రాజేష్. గడిచిన కొద్దిరోజుల క్రితం మోంథ తుఫాను వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులకు ఒక్కొక్క కవులు రైతుకు మూడువేల రూపాయలు ప్రకారం ఆర్థిక సహాయం అందించి వారిలో తనవంతు సహాయంగా ఆత్మస్థైర్యం నింపారు గోళ్ళ రాజేష్. నేడు మరో అడుగు ముందుకేసి ఈ రబి సీజన్లో రైతులు వేసుకునే పంటలకు పంట దెబ్బ తినకుండా పంట మంచి రాబడి రావాలని సదుద్దేశంతో కౌలు రైతు కార్డు కలిగిన పేద,మధ్యతరగతి రైతులను ఆదుకోవాలని వారికి ఒక బస్తా యూరియా,ఒక బస్తా డి.ఏ.పి,ఒక బస్తా అమోనియా ఇచ్చి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు గొల్ల రాజేష్.
కౌలు రైతు కార్డు కలిగిన నంద్యాల నియోజకవర్గ ప్రతి రైతన్న ఇందుకు అర్హుడు “జగత్ ధాత్రి” ఈ పథకం లబ్ధి కొరకు నంద్యాల నియోజకర్గం కౌలు రైతులు నంద్యాలలోని నూనెపల్లె కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న సాయి ఆనంద నిలయం కాంప్లెక్స్ నందు కల నాలుగో నెంబర్ షాపులో మీ కౌలు రైతు కార్డు జిరాక్స్,ఆధార్ కార్డు జిరాక్స్,ఓటరు కార్డు ను అందించి మీ పేరు నమోదు చేసుకోగలరు.

Scroll to Top