
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 24 :
77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ నెల 26వ తేదీ సోమవారం నాడు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని మండల, డివిజన్ మరియు మున్సిపల్ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి పండుగ వాతావరణంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన నిర్వహించబోమని స్పష్టం చేశారు. కావున అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి అనవసరమైన ప్రయాసలకోర్చి నంద్యాల జిల్లా కేంద్రానికి రావద్దని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
