



సత్యం వార్త / నంద్యాల / జనవరి 23 :
స్థానిక నంద్యాల జిల్లాలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో శుక్రవారము వసంత పంచమి మరియు అక్షరాభ్యాస కార్యక్రమములను ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో లక్ష్మణాచారి,కార్తీక్, ఫనీంద్ర పూజరులచేత మొదటిగా సరస్వతీ లక్ష్మీ గణపతి హోమం కూడా చేయడము జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత విచ్చేసి మాట్లాడుతూ సరస్వతీ దేవి జన్మదినమైన మాఘ శుద్ధ పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించడం వలన చిన్నారులకు సకల విద్యలు ప్రాప్తిస్తాయని మన నమ్మకం. మా బాల అకాడమీ పాఠశాలలో ప్రతి సంవత్సరము ఆనవాయితీగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భగవంతుని దీవెనలు మెండుగా అందాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఇటువంటి దీవెనకరమైన కార్యక్రమమును ఏర్పాటు చేసినందుకు పాఠశాల చిన్నారుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదములను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత పాఠశాల చిన్నారుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
