

సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రాన్ని సాధించగలము సుభాష్ చంద్రబోస్
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 23 :
శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో భారత స్వాతంత్ర్య సమరయోధుడు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ రామకృష్ణ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డా. జి. రామకృష్ణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నేతాజీ చిత్రపటానికి పూలమాల పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డా. రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, సుభాష్ చంద్ర బోస్ దేశభక్తి, త్యాగం, ధైర్యసాహసాలు భారత యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. “నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను” అనే ఆయన నినాదం దేశ స్వాతంత్ర్య పోరాటంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. విద్యార్థులు నేతాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణతో, దేశ సేవ భావంతో ముందుకు సాగాలని సూచించారు. స్వామి వివేకానంద భారతీయ యువతకు ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రదాత అయితే సుభాష్ చంద్రబోస్ యువతకు సంకల్ప పోరాట పటిమ స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. యువత లక్ష్యసాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సుభాష్ చంద్రబోస్ వంటి వారు ఎలాంటి ధైర్య సాహసాలను ప్రదర్శించాలో గమనించాలని ఆచరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.ఎస్. ప్రగతి మాట్లాడుతూ, సుభాష్ చంద్ర బోస్ నాయకత్వ లక్షణాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. డాక్టర్ లలితా సరస్వతి మాట్లాడుతూ, స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ పాత్రను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను విద్యార్థులు జీవితంలో అమలు చేయాలని సూచించారు. ఈ వేడుకల్లో కళాశాల అధ్యాపక బృందం మొత్తం పాల్గొని నేతాజీకి నివాళులు అర్పించారు. విద్యార్థులచే నిర్వహించిన ప్రసంగాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ జయంతి వేడుకలు విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని మరింత పెంపొందించాయని కళాశాల యాజమాన్యం పేర్కొంది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
