రోడ్డు రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం అవినీతి వల్లే ప్రమాదాలు

రోడ్ సేఫ్టీ మర్చి టోల్గేట్ వసూళ్లు

మృతుల కుటుంబాలకు 50 లక్షలు ఇచ్చి క్షతగాత్రులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు.

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 23 :

మండల కేంద్రంలోని శిరివెళ్ల మిట్ట సమీపంలో గల 40వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటనా స్థలాన్నిసిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగ నాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ సిరివెళ్ల మండల సిపిఐ కార్యదర్శి మధు సిపిఐ జిల్లా సమితి సభ్యులు బి.నారాయణ తదితరులు తదితరులు పరిశీలించారు. అనంతరం వారు మీడియా  ప్రతినిధులతో మాట్లాడుతూ బస్సు ఓనరు ప్రొద్దుటూరు అయితే రిజిస్టర్ ఇతర రాష్ట్రాల్లో జరిగిందని రోడ్డు రవాణా శాఖ అధికారుల అవినీతి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని రంగ నాయుడు గాటుగా ఆరోపించారు. రోడ్డు సేఫ్టీని మరిచి కేవలం వాహన తనిఖీలు చలానాలు వేస్తూ వాహనదారులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఫిట్నెస్ లేని వాహనాలను హద్దు అదుపు లేని వేగంతో వెళ్లే వాహనాలను నియంత్రించాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని అన్నారు. టోల్ ప్లాజాలలో టోల్గేట్ల రూపంలో కోట్ల రూపాయలు దండుకుంటున్న కాంట్రాక్టర్లు నేషనల్ హైవే అధికారులు రహదారి భద్రతను మరిచారని అన్నారు. అనంతరం 40 వ జాతీయ రహదారిపై జరిగిన సంఘటన స్థలాన్ని పూర్తిగా కాలిపోయిన ట్రావెల్ బస్సును కంటైనర్ను పరిశీలించారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 36 మంది గాయపడ్డారని మృతుల కుటుంబాలకు 50 లక్షలు అందించి తక్షణమే ఆదుకోవాలని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ఆర్థిక సహాయం ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని పలు హైవేలపై రాష్ట్ర రహదారులపై ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టకపోతే ప్రజా ఉద్యమాలకు తెరలేపుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు అనుబంధ సంఘ ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top