


కలెక్టరేట్ లో అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్
అరకు కాఫీ కి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు
అరకు కాఫీని ప్రతి ఒక్కరు సేవించి ఆరోగ్యంగా జీవించాలి
- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 21 :
అరకు కాఫీని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ హాల్ ఆవరణంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ,జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ లతో కలిసి అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ మాట్లాడుతూ…. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు కాఫీకి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇది మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతుందని మొదటగా రాష్ట్రంలోని ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ అరకు కాఫీకి అలవాటు పడే విధంగా చూడాలన్నారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని చాలామంది అరకు కాఫీని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎంతో రుచికరంగా ఉండే అరకు కాఫీని ప్రతి ఒక్కరు సేవించాలన్నారు. డ్వాక్రా గ్రూపు సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వారికి కలెక్టరేట్లో స్థలం ఇచ్చి అరకు టీ స్టాల్ కొరకు లోన్ మంజూరు చేయించడం జరిగిందన్నారు. అరకు కాఫీ స్టాల్ నిర్వాహకులు కాఫీని క్వాలిటీగా రుచికరంగా చేసి ప్రజలకు విక్రయించాలన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ….అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని ప్రతి ఒక్కరూ అరకు కాఫీని సేవించి ఆరోగ్యంగా జీవించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు ప్రశంసలు పొందిన అరకు కాఫీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయించాలని సూచించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో డిఆర్డిఏ, హార్టికల్చర్ వారి సపోర్టుతో ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అరకు కాఫీ యూనిట్ కాస్ట్ మొత్తం 6 లక్షలు కాక అందులో 35% సబ్సిడీ ఇస్తూ మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయించడం జరిగిందన్నారు. జిల్లా నలుమూలల నుంచి కలెక్టర్ కార్యాలయానికి వస్తున్న ప్రజలందరూ అరకు కాఫీ ని రుచి చూసి రూరల్ లవ్లీ వుడ్ ఆక్టివిటీస్ కు సపోర్టు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.
