కన్నుల పండుగగా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ మహోత్సవం

ఆర్యవైశ్యులకు గుర్తింపు 2506 ఏళ్ళు పూర్తయ్యింది.

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 20 :
నంద్యాల పట్టణంలోని నూనె పల్లె,నంద్యాలలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
నంద్యాల జిల్లా నూనెపల్లె,నంద్యాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం లలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆత్మహర్పణ దినోత్సవం కన్నుల పండగ జరిగినది .ఉదయం 5 గంటలకు మూలవిరాట్ అభిషేకము, హోమము ఉదయం 6;30 హోమం ప్రారంభం గంటలకు 10:00గంటలకు పూర్ణాహుతి 10;30 గంటలనుండి సామూహిక ఉచిత కుంకుమార్చన , గ్రామములో ఉండే ఆర్యవైశ్యులందరికీ తీర్థప్రసాదాలు , విందు ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి, నూనెపల్లిఆర్యవైశ్య సంఘం, ప్రెసిడెంట్ ఆత్మకూరు సుదర్శన్ శెట్టి , సెక్రెటరీ , కాల్వ విజయ శేఖర్ ,కార్యదర్శి ,పోలా వరప్రసాద్ , యువజన సంఘం ప్రెసిడెంట్ మారం నాగరాజు , సెక్రెటరీ, గుబ్బ రజనీకాంత్ , మారం శ్రీనివాసులు, గుంటూరు సుమంత్, మాలపాటి రఘువీర్ కుమార్, శ్రీకాకుళం రంజిత్ ,మేడ నాగేంద్ర ప్రసాద్ ,సూరా నాగేంద్ర, మహిళా మండలి, ప్రెసిడెంట్ . కళావతి, రాజేశ్వరి ,నంద్యాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాసి శ్రీనివాసులు ( వాసు ) అడ్డగాళ్ల మధు సాధన రావు, బై సాని రామ శేషు,మిరియాల వెంకట రామ్ ప్రసాద్,అచ్యుత సుధాకర్ ,తాడువాయి నారాయణ సంఘాల కమిటీ సభ్యులు ఆర్య వైశ్యులు పాల్గొని విజయవంతం చేసినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరాశక్తి కి పదునాలుగు నామాలలో కన్యకా ఒకటి.ఈ కన్యకా అని పేరు పరమేశ్వరి అను పదాన్ని జోడించి శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిగా మన పూర్వీకులు అనాదిగా ఆరాధిస్తున్నారు. శ్రీ కన్యకాపరమేశ్వరి దేవియే అంధకార బంధమైన ఈ ప్రపంచంలో అహింసా జ్యోతిని వెలిగించుటకై వాసవీ అను నామంతో కుసుమాంబ,కుసుమ గుప్తలకు తెలుగింటి ఆడపడుచుగా పవిత్ర గోదావరి తీరంలో జన్మించి తన అపూర్వ ఆత్మార్పణ ద్వారా వర్ణాశ్రమాచార్య ధర్మ సంరక్షణ చేసిందన్నారు.అహింసా పరమో ధర్మ అను వేదోక్తినీ కార్య రూపంలో చూపించి ప్రపంచంలో ప్రథమ సత్యాగ్రహి అయిందన్నారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి అగ్నిగుండంలో ప్రవేశించి ఆత్మార్పణం చేసి మనము ఆర్యవైశ్యులు అని గుర్తింపు తెచ్చి ఈ రోజుకు 2506 సంవత్సరాలు అయిందన్నారు.అనంతరం ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో కొలత బృందం తో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Scroll to Top