
సత్యం వార్త / నంద్యాల / జనవరి 20 :
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిల్ కి బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబిల్ నాయకత్వం కీలకంగా నిలుస్తుందన్నారు. పార్టీ సిద్ధాంతాలు, జాతీయవాద భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయనకు విశేష అనుభవం ఉందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న వేళ, జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిల్ పార్టీకి మరింత శక్తిని అందిస్తారని అభిరుచి మధు విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ నంద్యాల జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, పార్టీకి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
