పేకాట స్థావరంపై డ్రోన్ దాడి

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 19 :
బనగానపల్లి మండలం హుసేనాపురం సమీపంలోని కొండ గనుల ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు డ్రోన్ సహాయంతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.43,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎనకండ్ల గ్రామానికి చెందిన తిరుపము రెడ్డి, మల్లీశ్వరి రెడ్డి కలిసి నంద్యాల, ఉయ్యాలవాడ, కడప జిల్లా పెద్దముడియం ప్రాంతాల నుంచి సుమారు పదిమందిని రప్పించి పేకాట నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో తిరుపము రెడ్డి, మల్లీశ్వరి రెడ్డి పరారయ్యారు.
డ్రోన్ సహాయంతో కొండల మధ్య పారిపోతున్న నిందితులను వెంబడించి పట్టుకోవడంలో పోలీసులు విజయం సాధించారు. నంద్యాల ఎస్పీ, డీఎస్పీ ఆలోచన మేరకు డ్రోన్ వినియోగించామని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన డ్రోన్ ఆపరేటర్‌ను, బనగానపల్లి ఎస్సై దుగ్గిరెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Scroll to Top