

విజేతగా నిలిచిన లెజెండ్స్ జట్టు,రన్నర్స్ కప్ అందుకున్న వారియర్స్ జట్టు
బహుమతి ప్రదానం చేసిన డాక్టర్ రవి కృష్ణ, మౌలాలి రెడ్డి
ఉపాధ్యాయుల లో ఉత్సాహం నింపడానికి పోటీల నిర్వహణ – షావలి రెడ్డి
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 14 :
శ్రీ గురు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్,శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అధ్యాపక బృందానికి గత రెండు రోజులుగా శ్రీ గురు రాజా ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ షేక్షావలి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గురు రాజా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు విజయవంతంగా ముగిసాయి.
బహుమతి ప్రదానోత్సవానికి నంద్యాల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మౌలాలి రెడ్డి, రాఘవరెడ్డి అతిధులుగా పాల్గొని విజేత జట్టుకు,రన్నర్స్ జట్టుకు,వ్యక్తిగత ప్రతిభ చూపిన క్రీడాకారులకు ట్రోఫీలు,జట్టు సభ్యులకు పతకాలు అందజేసి అభినందించారు.
లెజెండ్స్,వారియర్స్ పేర్లతో రెండు జట్లుగా ఏర్పడి ఐదు క్రికెట్ లీగ్ మ్యాచ్ లు నిర్వహించగా,మూడు మ్యాచ్ లలో విజేతగా నిలిచిన లెజెండ్స్ జట్టు గురు రాజా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ట్రోఫీ కైవసం చేసుకున్నారు. ఆ కెప్టెన్ షేక్షావలి రెడ్డి జట్టు సభ్యులతో కలిసి ట్రోఫీని అందుకున్నారు. వారియర్స్ కెప్టెన్ సుబ్బారావు, జట్టు సభ్యులతో కలిసి రన్నర్స్ ట్రోఫీ అందుకున్నారు.వ్యక్తిగత ప్రతిభకు మ్యాన్ అఫ్ ది సిరీస్ రాజు, బెస్ట్ బ్యాట్స్ మన్ గా షాహిన్ షా, బెస్ట్ బౌలర్ గా అనిల్ ట్రోఫీలు,నగదు బహుమతులు అందుకున్నారు.
భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయుల కోసం సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీ గురు రాజా ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్ డైరెక్టర్ షేక్షావలి రెడ్డి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి అంపైర్లు,ఉపాధ్యాయులు,సిబ్బంది పాల్గొన్నారు.
