

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 13 :
నంద్యాల జిల్లాలోని మహిళా కానిస్టేబుల్ ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విధి నిర్వహణలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదనే ఉద్దేశంతో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఉత్తర్వుల మేరకు మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాం ఆధ్వర్యంలో నేడు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు మహిళలకు వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలపై నంద్యాల పట్టణంలోని డాక్టర్ నర్మదా, డాక్టర్ మాధవి,డాక్టర్ వసుధ రాణి మరియు డాక్టర్ లక్ష్మీ సౌజన్య డాక్టర్లచే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ల నంద్యాల జిల్లాలో పనిచేయుచున్న మహిళా కానిస్టేబుళ్లు మరియు మహిళ ఏఎస్ఐలు మరియు మహిళా హెడ్ కానిస్టేబుల్ లకు సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ సర్వేకల్ క్యాన్సర్ రాకుండా ముందస్తుగా గుర్తించడం కష్టం కావున ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క బాలికలకు వ్యాక్సినేషన్ చేయడం వల్ల సర్వేకల్ క్యాన్సర్ రాకుండా మహిళలు ముందస్తుగానే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోగలరని తెలియజేశారు.
వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావము ఉండదని వారికి అవగాహన కల్పిస్తూ లైఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు హాస్పిటల్ డాక్టర్ అయినటువంటి లక్ష్మీ సౌజన్య కూడా గర్భాశయ ముఖద్వారం పై వచ్చే క్యాన్సర్ వల్ల గుర్తించకపోతే అది మరణానికి కూడా దారి తీయవచ్చునని కానిస్టేబుల్ లకు వివరించడం జరిగింది. మీకు అవగాహన కల్పిస్తే సమాజంలో ప్రతి మహిళ కూడా మీ ద్వారా కూడా అవగాహన కల్పించగలమని ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ మరియు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం ఈ అవేర్నెస్ ప్రోగ్రాం నకు సహకరించి నందున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నరు.
నంద్యాల మహిళా పోలీసు సిబ్బంది (శక్తి టీం) ద్వారా వివిధ పాఠశాలలు కళాశాలలో విద్యార్థినులకు మరియు మహిళలకు అవగాహన కల్పించడం జరుగుతుందని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాం తెలిపారు.
