

సత్యం వార్త / నంద్యాల / జనవరి 13 :
సిపిఐ ప్రచార జీపు జాత ముగింపు సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన – సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రామాంజనేయులు…
నంద్యాల ప్రజలకు పిలుపునిచ్చిన సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు..
సిపిఐ ప్రచార జీపు జాత మూడవ రోజు నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో ముగించడం జరిగింది..
సిపిఐ ప్రచార జీపు జాత ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా పాల్గొని ముగించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. రామాంజనేయులు
ఈ ముగింపు సభ సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.
ఖమ్మం నగరంలో ఈ నెల 18 న జరగబోయే సిపిఐ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో జరిగిన సిపిఐ ప్రచార జీపు జాత గత మూడు రోజులుగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిర్వహించి ఈ రోజు మధ్యాహ్నం నంద్యాల పట్టణానికి చేరుకొని శ్రీనివాస సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి,ముగించడం జరిగిందని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు తెలిపారు.
ఈ ముగింపు సభలో సిపిఐ పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
