పోలీస్ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి 68 ఫిర్యాదులు

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 12 :
నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయం నందు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N . యుగంధర్ బాబు సోమవారం ( 12-01-2026) “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదుదారుల నుండి 68 ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో అడిషనల్ ఎస్పీ స్వయంగా మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదులు పరిష్కరిస్తామని తెలియజేశారు. ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ ఫిర్యాదులలో కుటుంబ కలహాలు,సివిల్ తగాదాలు, మొదలగునవి ఉన్నాయి.
ఫిర్యాదులలో కొన్ని:
1).బండిఆత్మకూరు మండలం భోజనం గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 359/B1 భూమి విక్రయ ఒప్పందం ప్రకారం 1,50,000/-రూపాయలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా పరమటూరు గ్రామానికి చెందిన రామ మద్దిలేటి, రంగస్వామి ,మధు శ్రీధర్ ,బాల మద్దిలేటి, ఎల్లయ్య మరికొందరు మోసం చేస్తున్నారని నాకు న్యాయం చేయండని నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన వెంకట నాగేశ్వర్ రెడ్డి అడిషనల్ ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
2).ప్రాస్పరస్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి నా వద్ద నుండి బోజుగు.కిషోర్ నాలుగు లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేసినాడని నాకు న్యాయం చేయండని డోన్ పట్టణానికి చెందిన దేవా సంతోష్ కుమార్ అడిషనల్ ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
3).వారసత్వరీత్యా నాకు వచ్చిన భూమిలో నేను ఇల్లు కట్టుకొనుచుండగా చౌడేశ్వరయ్య అనే వ్యక్తి గొడవ పడుతూ కబ్జా చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నాకు న్యాయం చేయండని నంద్యాలకు చెందిన వెంకటేశ్వర్లు అడిషనల్ ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
విచారణ జరిపి ఫిర్యాదిదారులకు చట్ట పరిదిలో న్యాయం చేస్తాం – అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N . యుగంధర్ బాబు.

Scroll to Top