మస్జిద్ అల్ ఫుర్ఖాన్ ఈద్గా విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

సత్యం వార్త / నంద్యాల / జనవరి 12 :
నంద్యాల పట్టణం భీమవరం రోడ్డులోని మస్జిద్ అల్ ఫుర్ఖాన్ ఈద్గా కు చెందిన పేద విద్యార్థులకు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నోటు పుస్తకాలను అందజేశారు. సోమవారం నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఈద్గా ప్రతినిధులకు ఫిరోజ్ ఈ పుస్తకాలను అప్పగించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ జనవరి ఒకటో తేదీన ఇచ్చిన పిలుపు మేరకు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బొకేలు వద్దు – పుస్తకాలు ముద్దు అనే నినాదంతో మంత్రి చేసిన సూచనకు నాయకులు, కార్యకర్తలు విశేషంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. నాయకులు అందజేసిన పెన్నులు, పుస్తకాలు, మరియు స్కూల్ బ్యాగులను నేడు నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు అందజేస్తున్నామని ఫిరోజ్ వివరించారు. ఈ పుస్తకాలు విద్యార్థుల చదువుకు ఎంతో కొంత తోడ్పడతాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, ఉర్దూ డిఐ అస్ముద్దీన్, ఖాదర్ కింగ్, ఈద్గా ప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top