నంద్యాల జిల్లాలో నాలుగు పోలీసు స్టేషన్ ల పరిదులలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్

శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు పోలీసులు అందగా ఉంటారని భరోసా కల్పించేందుకు నిరంతరం కొనసాగుతాయి

జిల్లాలో చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పోలీస్ యంత్రాంగం

సరైన ధ్రువపత్రాలు లేని 25 మోటార్ సైకిళ్లు, 77 క్వాటర్ బాటిల్లు,02 బీర్లు, 25 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకోవడంతో పాటు 200 లీటర్ల బెల్లం ఊట ద్వంశం

శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 11 :
నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా మరియు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు నాలుగు పోలీసు స్టేషన్ ల పరిదులలో నంద్యాల తాలూకా,ముచ్చుమర్రి, నందికొట్కూర్ టౌన్,ఆత్మకూరు టౌన్ పోలీసు స్టేషన్ ల పరీదులలో ఆయా పోలీసు అదికారులు ఆరి సిబ్బంది సహాయంతో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అనుమానితులు, నేరచరిత్ర గలవారు,రౌడీషీటర్లు మొదలగు వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి అక్రమ మద్యంతో పాటు సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఇందులో సరైన ధ్రువపత్రాలు లేని 25 మోటార్ సైకిళ్లు, అక్రమ మద్యం 77 క్వాటర్ బాటిల్లు,02 బీర్లు, 25 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసులు నమోదు చెయ్యడం జరిగింది.మరియు 200 లీటర్ల బెల్లం ఊట ద్వంశం చెయ్యడం జరిగింది.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాలను నివారించడమే లక్ష్యంగా మరియు ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా నివారించుటకు, పోలీసులు ప్రజల కొరకు ఉన్నారనే భరోసా కల్పించడం కొరకు ఈ కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ లు తరచూ నిర్వహించడం జరుతుందని పోలీసు అదికారులు తెలిపారు.

అనంతరం ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి గొడవలకు అల్లర్లకు వెళ్లకుండా ఐకమత్యంగా జీవించాలని, ఏదైనా సమస్య ఉంటే ముందుగా పోలీసు వారిని సంప్రదించాలని తద్వారా సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని మరియు ప్రస్తుతం సమాజంలో జరిగే సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలు మరియు చిన్న పిల్లలపై జరిగే నేరాల గురించి అప్రమత్తంగా ఉండాలని మరియు కొత్త చట్టలపై అవగాహన కల్పించడం జరిగింది.
అత్యవసర సమయంలో వినియోగించవలసిన టోల్ ఫ్రీ నంబర్ల గురించి అనగా మహిళలకు వివరిస్తూ చైల్డ్ మ్యారేజ్ కు సంబంధించి 1098 , సైబర్ క్రైమ్ కు సంబంధించి 1930 , ఎమర్జెన్సీ డయల్ 100,112, నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చునని తెలియజేశారు.

Scroll to Top