


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 11 :
నంద్యాల ప్రాంత వాసి అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త ఎన్నో చారిత్రాత్మక మైన తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తనకు పేద మధ్య బడుగు బలహీన వర్గాలైన ప్రజలు మెచ్చే ఎన్నో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేస్తూ నంద్యాల ప్రజల మన్ననలు పొందుతున్న విషయం నంద్యాల ప్రాంత వాసులందరికి విధితమే.
సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నంద్యాల ప్రాంతవాసి ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజికవేత్త గోళ్ళ రాజేష్ నంద్యాల ప్రాంత అవ్వా,తాతలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు .
తన ఇంకో ముఖ్యమైన పథకాన్ని నంద్యాల ప్రాంత వాసులకు ఇవ్వాలని తలుచుకున్నారు. ఇదివరకే ఒక్క రూపాయికి రెండు పుల్కాలు,పప్పు,కర్రీ మరి ఒక్క రూపాయికే వెజిటబుల్ రైస్,కర్రీ ప్రజలకు అందివ్వడం జరుతున్నది ప్రజలకు విధితమే.
ప్రస్తుతం ఆయన ఇంకో అడుగు ముందుకు వేసి ఒక రూపాయికి పప్పు, జోన్నా రొట్టె ఇవ్వాలని సంకల్పించి సంక్రాంతి శుభ సందర్భంగా నంద్యాల ప్రాంతవాసులకు ఇవ్వాలని కార్యరూపం దాలుస్తున్నారు ఇందుకు సహకరించవలసిందిగా ప్రజలను నంద్యాల ప్రాంత వాసులందరికి నమస్కరిస్తూ కోరడం జరుగుతున్నది.
ఈ సందర్భంగా మన పేదల పెద్దన్న గోళ్ళ రాజేష్ మాట్లాడుతూ గతంలో దివంగత నేత మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి గారు కూడా పేదలను దృష్టిలో ఉంచుకొని ఒక్క రూపాయికి పప్పు ఒక రూపాయికి రొట్టె పెట్టడం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాంటి మహనీయున్ని మర్చిపోకుండా గుర్తుంచుకోవాలని కోరారు.
అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైనటువంటి ప్రజలకు వారికి మూడో విడత చెల్లించవలసిన డబ్బును కూడా సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ఆయన సంకల్పించారు దీనికి పత్రిక విలేకరి మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు సోషియల్ మీడియా సోదరులు అందరూ సహకరించవలసిందిగా కోరారు.
నేను చేసే కార్యక్రమాలలో నాకు సహకరిస్తామని చాలామంది మిత్రులు కొన్ని విషయాలు తెలియజేశారని అందుకు మీరే ప్రజలకు అందించండి అని వారితో తెలియజేయడం జరిగిందని తెలిపారు.అది ఏ
కారణం ఏంటంటే నేను నంద్యాల ప్రాంతం వాసి కాదు అనుకుని చాలామంది అనుకుంటున్నారు నా చదువు విద్యాభ్యాసం నా పుట్టుక దగ్గర నుంచి నేను నంద్యాల లోకల్ నేను నంద్యాలలో పుట్టి పెరిగానని విద్యాభ్యాసం కూడా నంద్యాల లోనే జరిగిందని కొన్ని రోజులు నంద్యాలలో వ్యాపారం కూడా చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
తరువాత కొన్ని వ్యాపార, నా వ్యక్తిగత కారణాలవల్ల నేను నంద్యాలను వదిలిపెట్టడం జరిగిందని కాని నేను పుట్టి,పెరిగిన నంద్యాలపై ఉన్న మమకారం చంపుకోలేక నంద్యాల ప్రాంత ప్రజలకు ఏదో ఒక విదంగా ప్రజలకు సహాయ పడాలని నా వంతు సహాయ, సహకారాలు అందించాలని సదుద్దేశంతో మాత్రమే సేవా కార్యక్రమాలు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నానన్నారు.
ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయుట కొరకు నేను ఎవరి నుండి డొనేషన్లో రూపేన గాని చారిటీస్ నుంచి గాని ఎలాంటి తన రూపేణా గాని,వాస్తు రూపేణా గాని తీసుకోవడం లేదని ఇది నా సొంత నిధులతో మాత్రమే అంది చేస్తున్నాను దయచేసి నంద్యాల ప్రజలందరు ఈ విషయాన్ని గమనించగలరని కోరారు. కొంతమంది ప్రముఖులు సోదరుడు సమానుడు పాత్రికేయుడు నూర్ భాషా ని తమ వంతు సహాయం చేస్తామని ఎన్నో విధాలుగా డబ్బులు ఇస్తామని కూడా అడిగి ఉన్నారు వాటిని కూడా నిరాకరించడం జరిగిందని. దీనిని తెలియజేయుటకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేను ఎవరి దగ్గర చారిటీస్ కానీ డబ్బులు గానీ మరియు ఇతర ఏ విదేనా తీసుకోవడం జరగడం లేదు.
