పిల్లలు మీకు తెలియని వ్యక్తులు ఏ వస్తువులు( తిను పదార్థాలు ) ఇచ్చిన తీసుకోకూడదు ఏఎస్పి ఉత్తర్వుల ప్రకారం హాస్టల్ పరిశీలించిన శక్తి టీం

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 11 :
నంద్యాల పట్టణం వైయస్సార్ నగర్ లో స్టార్ సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ బుడగ జంగాల పిల్లల హాస్టల్ ను నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ, మహిళా పోలీస్ లక్ష్మీదేవి అను శక్తి టీం రాజ, ఏ ఎస్ పి జవాలి ఆల్ఫండ్స్ ఉత్తర్వుల మేరకు వైయస్సార్ నగర్ లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసియా విద్యాలయ స్టార్ సొసైటీ హాస్టల్ ను విజిట్ చేసి సీసీ కెమెరాలు, వసతులను పరిశీలించగా అన్నియు బాగుగా ఉన్నవి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు తిను వస్తువులు ఇచ్చినచో తినరాదని పిలిచినచో వెళ్లరాదని, అమ్మాయిల పట్ల ఎవరైనా చెడుగా ప్రవర్తించిన టీచర్స్ గాని వార్డెన్ కు తెలియపరచవలయునని లేదా డయల్ 112 కాలుకు ఫోన్ చేయవలెనని పిల్లలకు చెప్పి చైతన్యపరచడం అయినది. ఈ కార్యక్రమంలో హాస్టల్ కరస్పాండెంట్ సుబ్బరాయుడు సారు మరియు వార్డెన్ నాగలక్ష్మి, సిబ్బంది లక్ష్మీదేవి, మమత, కమలబి, సౌజన్య మేడం ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top