
సత్యం వార్త / నంద్యాల / జనవరి 8 : నంద్యాల మండల కేంద్రంలో పలు ఎరువుల దుకాణాలపై మండల వ్యవసాయ అధికారి ప్రసాద్‌రావు, తహసీల్దార్ శ్రీనివాసులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బైసాని ట్రేడర్స్, సంజీవరెడ్డి ఏజెన్సీస్, మారుతీ ట్రేడింగ్ కంపెనీల్లో స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్, రసీదులు, బయో ఉత్పత్తుల అనుమతి పత్రాలు, యూరియా నిల్వలు, రోజువారీ అమ్మకాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ యూరియా వివరాలను ప్రతిరోజూ బోర్డుపై ప్రదర్శించాలని, ఎంఆర్పీకి మించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతించిన ఎరువులనే విక్రయించాలని, బయో ఉత్పత్తులకు సంబంధించిన ధృవపత్రాలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎఫ్సీఓ–1985 చట్టం ప్రకారం చర్యలు తప్పవని తెలిపారు.
