పోక్సో కేసులో ముద్దాయికి 20 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 1,00,000/- (లక్ష రూపాయలు) జరిమాన విధించిన కర్నూల్ జిల్లా పోక్స్ కోర్ట్ జడ్జి

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 8 : ముద్దాయి పటాన్.రహమ్తుల్లా ఖాన్ S/o లేట్ పటాన్. హుస్సేన్ ఖాన్, వయస్సు 31 సంవత్సరాలు.. జైలు శిక్ష :
POSCO కేసుకు 20 సంవత్సరాలు జైలు శిక్ష 50,000/- జరిమాణ,కిడ్నాప్ కేసుకు 05 సంవత్సరాలు జైలి శిక్ష 50,000/- జరిమాణ – వాదనలు వినిపించిన స్పెషల్ PP C.V శ్రీనివాసులు..
కేసు వివరాలు : 02.11.2020, పాణ్యం గ్రామ పరిధిలోని ఫిర్యాది కూతురిని నిందితుడు అయిన పటాన్ రహ్మతుల్లా ఖాన్, తండ్రి లేట్ పటాన్ హుస్సేన్ ఖాన్, నంద్యాల పట్టణం అనునతడు ఫిర్యాదిదారు ఇంటికి తరచుగా వచ్చి వెళ్తూ ఫిర్యాది కుమార్తె అయిన 16 సంవత్సరాల మైనర్ బాలికను మోసం చేసి ప్రలోభపెట్టి, ఆమెతో శారీరక సంబంధాలు కలిగి ఉన్నాడు.
బాలిక గర్భవతి అయిన విషయం తెలిసిన తర్వాత, నిందితుడు ఆమెను మోటార్ సైకిల్‌పై కిడ్నాప్ చేసి నెల్లూరుకు తీసుకెళ్లాడు. గర్భవతి అయిన విషయాన్ని ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరిస్తూ, నిరంతరం ఆమెను భయపెట్టాడు సదరు విషయం మీద ముద్దాయి పై సబ్ ఇన్స్పెక్టర్ రాకేష్ గారు కేసును నమోదు చెయ్యడం జరిగింది.ఈ కేసును అప్పటి పాణ్యం సీఐ గారైన జీవీన్. గంగనాథ్ బాబు విచారణ చేసి, చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
అనంతరం ఈ కేసులో సదరు ముద్దాయి బెయిలు మీద విడుదల అయ్యాక 2021 లో కోర్ట్ కి హాజరు కానందున కోర్ట్ వారు ముద్దాయి కి నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేశారు. 2021 నుండి నాన్ బెయిలబుల్ వారంట్ పెండింగ్‌లో ఉండి పోలీస్ వారికి దొరకకుండా ఉన్నాడు. సదరు కేసుకు మీద నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు మరియు నంద్యాల సబ్ డివిజన్ ఎం.జావళి ఆల్ఫోన్స్ IPS సూచనలతో పోక్సో కేసు అయినందున పాణ్యం CI మరియు SI లతో స్పెషల్ టీం ఏర్పాటు చేసి 2021 నుండి 2025 వరకు తప్పించుని తిరుగుతున్న నిందితుడు పటాన్ రహ్మతుల్లా ఖాన్‌ను పాణ్యం సీఐ వి. కిరణ్ కుమార్ రెడ్డి మరియు పాణ్యం ఎస్‌ఐ టి. నరేంద్ర కుమార్ రెడ్డి వారి ప్రత్యేక బృందంతో కలిసి 06/10/2025 వ తేదీన కర్ణాటక రాష్ట్రం గుల్బార్గా నందు అరెస్ట్ చేసి సదరు ముద్దాయిని కర్నూల్ పోక్సో కోర్ట్ నందు పెండింగ్ ఉన్న NBW ను అమలు చేసి హాజరు పరచగా తదనంతరం ఈ కేసులో కర్నూలులోని పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ A. రాజేంద్ర బాబు విచారణ జరిపగా నేరం రుజువు కావడంతో ముద్దాయికి 08.01.2026 న 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.ఒక లక్ష జరిమాన విడిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.
పై కేసులో సుమారు 4 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న NBW ఎగ్జిక్యూట్ చేసిన సీఐ వి.కిరణ్ కుమార్ రెడ్డి మరియు పాణ్యం ఎస్‌ఐ టి. నరేంద్ర కుమార్ రెడ్డి ను మరియు సిబ్బందిని దర్యాప్తు అధికారి అయిన CI జీవన్ గంగనాథ్ బాబును కోర్టు కానిస్టేబుల్ రామాంజనేయులు ను వాదనలు వినిపించిన స్పెషల్ PP C.V శ్రీనివాసులు గారిని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS మరియు నంద్యాల సబ్ డివిజన్ ఎం.జావళి ఆల్ఫోన్స్ IPS అభినందించారు.

Scroll to Top