ఘనం గా విద్యా, మేధా, ప్రతిభ పోటీలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 8 :
జిల్లా యువజన సంక్షేమ శాఖ – సెట్కూరు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్యా, మేధా ప్రతిభా పోటీలు శ్రీ రామకృష్ణ పిజీ కళాశాలలో ఘనంగా నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ వెంకటప్ప మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, కావున యువత వివేకానంద సందేశాలను స్ఫూర్తి గా తీసుకుని ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు.
రామకృష్ణ విద్యా సంస్థ ల చైర్మన్ రామకృష్ణ రెడ్డి ప్రసంగిస్తూ యువతలో నైపుణ్యాభివృద్ధి, విజ్ఞానం, సామాజిక బాధ్యత పెంపొందించడంలో ఇటువంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత డ్రగ్స్, ఆల్కహాల్, పొగాకు, గుట్కా వంటి చెడు వ్యాసనాలకు ఆకర్షతులు కాకూడదని వాటివల్ల జాతి నిర్వీర్యం అవుతుందని, కావున దురవ్యాసనాలకు దూరం గా ఉండాలని పిలుపునిచ్చారు.
సెట్కూరు సీఈఓ డా. వేణుగోపాల్ మాట్లాడుతూ మై భారత్ పోర్టల్ లో ఉంచిన డ్రాఫ్ట్ నేషనల్ యూత్ పాలసీ ని పరిశీలించి యువత, మేధావులు, స్వచ్చంద సేవాసంస్థలు, యువజన సంఘాల సభ్యులు తమ సూచనలు, సలహాలు సెట్కూరు కార్యాలయ మెయిల్ ఐడి ceosetkurur@gmail. com కు పంపాలని తెలిపారు.
పోటీల విజేతలు వక్తృత్వం 1) డి.జయలక్ష్మి 2) డి.దివ్య 3) వై. వర్షిత వ్యాస రచన 1) వి.శ్రావణి, 2) బి.ప్రణతి 3) డి.కౌసర్ డిబేట్ 1) రేవతి ప్రణవ సాయి 2) తేజదీప్ కుమార్ 3) రవికిరణ్ క్విజ్ 1) ఉషారాణి గ్రూప్, 2) మైథిలి గ్రూప్ 3) అశ్విత గ్రూప్ లకు జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాలు బహుకరించడం జరిగినది
ఈ కార్యక్రమం లో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు, బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లలిత, గణేష్ కమ్యూనిటీ ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ గారు, మాజీ జెడ్పీ సభ్యురాలు నారాయణమ్మ, గణేష్ కమిటీ సభ్యులు శంకర్, న్యాయవాది రామచంద్రు జిల్లాలోని వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, పాల్గొన్నారు.

Scroll to Top