
నంద్యాల జిల్లా / జనవరి 03- 2026 / సత్యం వార్త ప్రతినిధి :
37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఛాపిరేవుల టోల్ ప్లాజా అధికారులు చురుకుగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆర్ & బి నంద్యాల డీఈ సుబ్బారాయుడు, టీఎల్ సుధాకర్, ఆర్ఈ కార్తిక్, ఆర్టీఓ శ్రీకాంత్, ట్రాఫిక్ సీఐ చాన్ బాషా తదితర అధికారులు పాల్గొని, టోల్ ప్లాజాల వద్ద చేపట్టాల్సిన రోడ్డు భద్రతా చర్యలు, వాహనాల నియంత్రణ, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
ప్రత్యేకంగా ఛాపిరేవుల టోల్ ప్లాజా పరిధిలో ట్రాఫిక్ నిర్వహణను మరింత మెరుగుపర్చడం, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, అతివేగ నియంత్రణ, సిబ్బంది మధ్య సమన్వయంతో భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ప్రధాన అంశాలు :–
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలి.
అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం పూర్తిగా నిషేధం.
పాదచారులు రోడ్డు దాటే సమయంలో జీబ్రా క్రాసింగ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్‌ఓబీలు) మాత్రమే ఉపయోగించాలి.
వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలి.
వాహనాలను కేవలం నిర్దేశిత పార్కింగ్ స్థలాలు, ట్రక్ లే-బైస్ల వద్ద మాత్రమే నిలపాలి.
అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందేందుకు జాతీయ రహదారి హెల్ప్‌లైన్ నంబర్‌ను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
