స్వర్ణాంధ్ర స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న 38వ వార్డు టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 17:
నంద్యాల టౌన్ స్థానిక 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ నందు 2025-2026 సంవత్సరానికి సంబంధించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాన్ని స్థానిక మంత్రి వర్యులు ఎన్ఎండి .ఫరూక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆదేశాల మేరకు 17న ఉదయం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బుగ్గరాముడు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయాన్నే మున్సిపల్ కార్మిక సిబ్బంది అందరూ కలసి రోడ్లు, కాలువలు,వీధులు అన్నీకూడా శుభ్రపరచి సకాలంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇళ్ల దగ్గరికి వెళ్లి చెత్తను స్వీకరించడం మా వార్డు నందు క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తున్నందుకు మున్సిపల్ సిబ్బంది వారికి మా తరపున మా వార్డు ప్రజల తరపున మా తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ అధికారి శివప్రసాద్ రెడ్డి,హనుమంత్,టీడీపీ నాయకులు నందము బాబు రావు,మహేష్ బాబు, వడ్డే నాగేంద్ర,తేజ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top