శ్రీ శారదా విద్యాపీఠం విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 09 :

నంద్యాల పట్టణం 7 వ వార్డు ఫరూక్ నగర్ కు చెందిన శ్రీ శారదా విద్యాపీఠం పేద విద్యార్థులకు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నోటు పుస్తకాలను అందజేశారు. సోమవారం నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ శారదా విద్యాపీఠం హెడ్ మాస్టర్ కి ఫిరోజ్ ఈ పుస్తకాలను అప్పగించారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ జనవరి ఒకటో తేదీన ఇచ్చిన పిలుపు మేరకు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బొకేలు వద్దు – పుస్తకాలు ముద్దు అనే నినాదంతో మంత్రి ఫరూక్ చేసిన సూచనకు నాయకులు, కార్యకర్తలు విశేషంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. నాయకులు అందజేసిన పెన్నులు, పుస్తకాలు, మరియు స్కూల్ బ్యాగులను నేడు నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు అందజేస్తున్నామని ఫిరోజ్ వివరించారు. ఈ పుస్తకాలు విద్యార్థుల చదువుకు ఎంతో కొంత తోడ్పడతాయని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శారదా విద్యా పీఠం ప్రధానాచార్యులు వెంకట కృష్ణయ్య, కౌన్సిలర్ కండె శ్యాంసుందర్ లాల్, తెలుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్త , 7 వ వార్డ్ ఫరూక్ నగర్ ఇంచార్జి సైలాబ్ , మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అజ్మీర్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top