శ్రీ శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో సంక్రాంతి ముందస్తు సంబరాలు

సత్యం వార్త / నంద్యాల /జనవరి 8 : శ్రీ శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో సంక్రాంతి ముందస్తు సంబరాలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా ప్రీ–ప్రైమరీ , ప్రైమరీ విద్యార్థుల కోసం సంప్రదాయబద్ధంగా భోగి పళ్ళు కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల చైర్మన్ సుధాకర్, రమ్య మేడం చిన్నారుల పై సంప్రదాయబద్ధంగా భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత ఉట్టిపడేలా చేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి.
విద్యార్థుల పేరెంట్స్ కోసం నిర్వహించిన మెహందీ మరియు రంగోలి పోటీలకు మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ సుధాకర్ , రమ్య మేడం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చైర్మెన్ సుధాకర్ విద్యార్థుల్లో భారతీయ పండుగలు, సంప్రదాయాలు, సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. రంగోలి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఉత్తమ ఐదుగురు పేరెంట్స్‌ను ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేశారు. అలాగే మెహందీ పోటీల్లో మొదటి, రెండవ, మూడవ స్థానాలు సాధించిన విజేత పేరెంట్స్‌కు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శారద మేడం, పాఠశాల బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top