శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు

నల్లమల అభయారణ్యంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ అమ్మవారికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు ప్రత్యేక పూజలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 11 : శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లకు, నల్లమల అభయారణ్యంలోని శ్రీ ఇష్టకామేశ్వరీదేవీ అమ్మవారికి ఆదివారం బహుళ అష్టమిని పురస్కరించుకొని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివ చరణ్ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు విశేష పూజలు చేసి స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు.
దట్టమైన నల్లమల అభయారణ్యంలో అటవీశాఖ అధికారుల అనుమతితో అటవీశాఖ ఏర్పాటు చేసిన కమాండర్ జీపులో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు, కుటుంబ సభ్యులు అడవిలో రోడ్డు మార్గం సక్రమంగా లేకపోయిన అతి కష్టంపై శ్రీ ఇష్టకామేశ్వరీ దేవీ అమ్మవారికి ఆదివారం బహుళ అష్టమిని పురస్కరించుకొని విశేష పూజలు చేశారు. అనంతరం సాయంత్రం శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనంకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు, కుటుంబ సభ్యులు చేరుకోగానే శ్రీశైల దేవస్థానం ఈ ఓ శ్రీనివాసరావు, ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులకు స్వాగతం పలికారు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు ధ్వజ స్థంభంకు, శనగల బసవన్నకు, రత్నగర్భ గణపతి దేవుళ్ళతో పాటు శ్రీ మల్లికార్జున స్వామి వార్ల దర్శనం, అర్చకులచే ఆశీర్వచన, అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులకు వేద ఆశీర్వచనంతో సన్మానం చేసి తీర్థ ప్రసాదం అందజేసి, స్వామి, అమ్మవార్ల పటం బహుకరించారు.

Scroll to Top