శ్రీకాళహస్తిలో మార్కెట్ ప్రసాద్‌కు ప్రత్యేక సత్కారం

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 16 :

 ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్న వేళ, భక్తుడు మార్కెట్ ప్రసాద్ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచారు. పర్వదినాన ఆలయ కార్యనిర్వహణాధికారి టి. బాపిరెడ్డి చేతుల మీదుగా మార్కెట్ ప్రసాద్ దంపతులకు స్వామి–అమ్మవార్ల శేష వస్త్రాలు గౌరవపూర్వకంగా బహూకరించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులతో ప్రత్యేక మెమెంటోను కూడా అందజేశారు.  మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొన్న మార్కెట్ ప్రసాద్, స్వామి–అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక సేవల్లో భాగస్వామ్యులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు.

అలాగే శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో మార్కెట్ ప్రసాద్ ఆత్మీయంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రాభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ సంబంధం గురుకుల్‌తో కూడా మార్కెట్ ప్రసాద్ భక్తిపూర్వకంగా కలుసుకుని ఆశీర్వాదాలు పొందారు. మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి కృపతో జరిగిన ఈ సత్కారం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మార్కెట్ ప్రసాద్ తెలిపారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు విశేష ఏర్పాట్లు చేయబడగా, వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ ప్రసాద్‌కు ఆలయ అధికారులు, భక్తులు అభినందనలు తెలియజేశారు.

Scroll to Top