వైసీపీ నేతల పై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం – నంద్యాల వైసీపీ లీగల్ సెల్

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఆటవిక పరిపాలన సాగిస్తున్నది

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 03 :

కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన సాగిస్తూ ప్రజా వ్యతిరేక, దౌర్జన్యకర సంఘటనలకు పాల్పడుతున్నారని నంద్యాల లీగల్ సెల్ నేతలు విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, అమలు చేయమని అడిగిన వారిపై దాడులు చేస్తున్నారని లీగల్సేల్ నాయకులు విమర్శించారు. రాష్ట్ర వైసీపీ లీడర్ ఇచ్చిన పిలుపుమేరకు  నేడు స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియా  సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ లీగల్ సెల్ స్టేట్ సెక్రెటరీ శ్రీనివాసులు, వైసిపి స్టేట్ పర్సన్ తిమ్మారెడ్డి, నంద్యాల అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, సుహేల్ రానా,GV సుబ్బయ్య మరియు అడ్వకేట్స్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైసిపి లీగల్ సెల్  సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆటవిక పాలనను సాగిస్తున్నారని ప్రజా వ్యతిరేక విధానాలు , దౌర్జన్యాలు, దాడులు చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, జోగి రమేష్ ల ఇళ్లపై టిడిపి రౌడీ మూకలు దాడులు చేసి  ఆస్తులను ధ్వంసం చేసి బీభత్సాన్ని సృష్టించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వాటిద్వారా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలుసుకొని కూటమినేతలు దాడులకు  డైవర్ట్ రాజకీయాలకు తెరలేపుతున్నారని పేర్కొన్నారు. శ్రీవారి లడ్డు విషయంపై ఎటువంటి జంతువుల కొవ్వులు లేవని సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేసేందుకు వైయస్సార్ పార్టీ నేతలు పలుచోట్ల అవగాహన కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు విషయంలో చేసిన తప్పిదం పై క్షమాపణ చెప్పాల్సింది పోయి అసత్యపు ఆరోపణలు కలిగిన ఫ్లెక్సీ  లను వేసి వైసిపి నేతలను కించపరిచే విధంగా చేయడం తగదని అన్నారు. అటువంటి బ్యానర్లను తొలగించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు కోరగా ఆయనపై కర్రలు రాడ్లు రాళ్లతో దాడి చేసి బీభత్సాన్ని సృష్టించారని, ఇది చట్ట వ్యతిరేక చర్యలని ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దాడులకు దౌర్జన్యాలకు దిగడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి ఏనాడో  పోయిందని, తిరిగి ఈ కూటమి ప్రభుత్వంలో పెట్రోల్ బాంబులతో దాడులు చేసి ఇళ్లను దగ్ధం చేయడానికి పూనుకున్నారని వీటిని పోలీసులు అడ్డుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. భవిష్యత్తులో ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పోలీసు వ్యవస్థ అడ్డుకోవాలని శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు లీగల్ సెల్ ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Scroll to Top