


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 20 :
గ్రామదేవతల దీవెనలే దేశాభివృద్ధికి పునాది అని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామంలో బైరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో, వేద పండితులు తెలకపల్లి రఘురామ శర్మ పర్యవేక్షణలో వైభవంగా శ్రీ చౌదేశ్వరీదేవీ, శ్రీ మశమ్మ, శ్రీ గంగమ్మ అమ్మవార్ల నూతన ఆలయాలు, విగ్రహాల ప్రతిష్ట నిర్వహించారు. గ్రామ దేవతలకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన భార్య బైరెడ్డి భారతమ్మ, బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన భార్య బైరెడ్డి శ్రీలత, కూతురు బైరెడ్డి అనూషా రెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు తదితరులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ మా గ్రామం ముచ్చుమర్రి, నా నంద్యాల జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రజలు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని దేశ ప్రజలందరికీ గ్రామ దేవతల ఆశీస్సులు, దీవెనలు ఉండాలనీ ప్రత్యేక పూజలు చేశామన్నారు.
