

ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణంలో అజీజ్ కు నా తోడ్పాటు ఉంటుంది.
వక్ఫ్ భూములను ఎలా వినియోగించాలో ఆలోచించండి ప్రభుత్వం మీ వెంట ఉంటుంది.
- జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్.
సత్యం వార్త / ఫిబ్రవరి 02 :
నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్ లో గల వక్షభూమి నందు నిర్మిస్తున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్ శివ ప్రసాద్ లు పరిశీలించి మీడియా సమావేశం నిర్వహించారు.
మంత్రి ఫరూక్ కామెంట్స్:-
విలువైన స్థలాన్ని కాపాడి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్న అబ్దుల్ అజీజ్ ను అభినందిస్తున్న.
కసుమూరు దర్గా కు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం మంచి విషయం.
దర్గా నుంచి వచ్చే ఆదాయం ప్రజలకు ఉపయోగపడాలి.
స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా మహిళా సాధికారత పెంచేందుకు అబ్దుల్ అజీజ్ కృషి చేస్తున్నారు.
చంద్రబాబు హయాంలో ఎన్నో డిజిటల్ స్కిల్ కేంద్రాలను ఏర్పాటు చేశాం.
ఇప్పటికే దాదాపు 30 వేల ఎకరాలు అన్యక్రాంతం అయ్యాయి మిగతా భూములను ఇలానే కాపాడండి.
ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణంలో అబ్దుల్ అజీజ్ కు నా తోడ్పాటు ఉంటుంది.
స్కూలుకు ఇచ్చిన భూమి మినహా మిగతా భూమిని కమర్షియలైజ్ చేయాలని అబ్దుల్లా తీసుకు సూచిస్తున్న.
వక్ఫ్ బోర్డు భూములను ఎలా వినియోగించాలో ఆలోచించండి ప్రభుత్వం మీ వెంట ఉంటుంది
